schedule Monday, November 02, 2026

కాళికాదేవి ఆశీస్సులతో తాండూరు ప్రజలు సుఖశాంతులతో ఉండాలి

calendar_today October 14, 2026
person Prajagalam News
కాళికాదేవి ఆశీస్సులతో తాండూరు ప్రజలు సుఖశాంతులతో ఉండాలి

• ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

•  నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు

  (తాండూరు) శ్రీ కాళికాదేవి మాత ఆశీస్సులతో తాండూరు ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆకాంక్షించారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని శ్రీ కాళికాదేవి ఆలయాన్ని ఆయన సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారికి పూజలు సమర్పించారు. అనంతరం ఆలయ పూజారులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఆలయ ఈవో నరేందర్ శాలువాతో ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, అమ్మవారి కృపతో ప్రజలందరికీ మంచి జరగాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని, తాండూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కాళికాదేవి మాతను ప్రార్థించినట్లు తెలిపారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.