schedule Monday, November 02, 2026

పేదలకు కొండంత అండ సీఎం రిలీఫ్ ఫండ్ ..... కొత్తపల్లి సర్పంచ్ సుగుణ సుందరి చిన్నయ్య

calendar_today October 23, 2026
person Prajagalam News
పేదలకు కొండంత అండ సీఎం రిలీఫ్ ఫండ్  ..... కొత్తపల్లి సర్పంచ్ సుగుణ సుందరి చిన్నయ్య
ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) కొండంత అండగా నిలుస్తుందని కొత్తపల్లి గ్రామ సర్పంచ్ సుగుణ సుందరి చిన్నయ్య అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీకి చెందిన బాధితుడు జంగం చెన్నయ్యకు ప్రభుత్వం 38,500 రూపాయల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విజయ బుగ్గయ్య, పంచాయతీ కార్యదర్శి అరుణ, వార్డు మెంబర్ బిచ్చయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లెల మల్లయ్య మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.