schedule Monday, November 02, 2026

కాంగ్రెస్ పార్టీ కుల్కచర్ల మండల అధికార ప్రతినిధిగా మోత్కూర్ వెంకటేష్

calendar_today October 29, 2026
person Prajagalam News
కాంగ్రెస్ పార్టీ కుల్కచర్ల మండల అధికార ప్రతినిధిగా మోత్కూర్ వెంకటేష్
  కాంగ్రెస్ పార్టీ కుల్కచర్ల మండల అధికార ప్రతినిధిగా నియమితులైన మండల కేంద్రానికి చెందిన వార్డు సభ్యుడు మోత్కూర్ వెంకటేష్ కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయనను ఈ పదవిలో నియమిస్తూ జిల్లా పార్టీ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మోత్కూర్ వెంకటేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కీలకమైన బాధ్యతలు అప్పగించిన పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డికి, నియోజకవర్గ,మండల కాంగ్రెస్ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు, ప్రజా సమస్యలపై పార్టీ గళాన్ని సమర్థవంతంగా వినిపించేందుకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. మండలంలో పార్టీ పటిష్టతకు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు.మండల అధికార ప్రతినిధిగా మోత్కూర్ వెంకటేష్ నియామకం పట్ల కుల్కచర్ల మండల కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.