schedule Monday, November 02, 2026

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

calendar_today October 30, 2026
person Prajagalam News
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
 
 
    వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఇప్పాయిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు పండిట్ పి. యాదయ్య, హిందీ పండిట్ ఎం.డి. మహమూద్‌లను శుక్రవారం పాఠశాలలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందిన వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించి సత్కరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారి అభ్యున్నతికి కృషి చేస్తూ ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందడం పట్ల పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సేవలు విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సరిత, రుక్మిణి, శివశంకర్, లోకేశ్వర్, పీఆర్‌టీయూ టీఎస్ అధ్యక్షుడు శ్యాంసుందర్‌తో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.