మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం,గ్రామ అభివృద్ధికి భారీగా ప్రభుత్వ నిధులు మంజూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
October 31, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో నవల్గ గ్రామంలో రూ.57లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ
మాటల్లో చెప్పే ప్రభుత్వం కాదు,చేతల్లో చేసి చూపించే మా కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు.గ్రామాల్లో ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసుకుందామన్నారు.10 లక్షలతో సైడ్ డ్రైన్,సీసీ రోడ్డు,15 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభం.10 లక్షలతో మహిళ సంఘం భవన,2లక్షలతో జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ప్రహరీ గోడ,రూ.6 లక్షలతో రైతులకు మట్టి రోడ్డు,10 లక్షలతో సైడ్ డ్రైన్,రూ.4 లక్షలతో జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో కంప్యూటర్లు, సామాగ్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకాలు వేసి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నూతన రేషన్ కార్డులు 943 లబ్ధిదారులకు పంపిణీ చేసి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటమ్మ,మాజీ మండల అధ్యక్షుడు కాలల్ నర్సిములు గౌడ్, తహశీల్దార్ షాహిద బేగం,ఎంపిడిఓ సంపత్ కుమార్,పిఎసిఎస్ చైర్మన్ కరుణ అజయ్ ప్రసాద్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకరప్ప,మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రజవర్ధన్ రెడ్డి,సర్పంచుల అధ్యక్షులు వెంకటేష్ మహారాజ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ మహారాజ్,వెంకట్ రామ్ రెడ్డి,మాధవ రెడ్డి,అజయ్ ప్రసాద్,రాము నాయక్,శ్రీనివాస్ రెడ్డి,కిష్టప్ప,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.