schedule Monday, November 02, 2026

పదివి విరమణ,వీడుకోలు పలికిన తోటి సిబ్బంది

calendar_today November 1, 2026
person Prajagalam News
పదివి విరమణ,వీడుకోలు పలికిన తోటి సిబ్బంది
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో మండల మహిళ సహాయక పరస్పర సంస్థ కార్యాలయంలో ఏపీఎం పద్మా రావు విధులు నిర్వహిస్తూ శుక్రవారం నాడు పదవి విరమణ పొందారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఈ సంస్థలో గత 23 సంవత్సరాలుగా పనిచేస్తూ, మొదటగా వెలుగు సంస్థ (సెర్ప్)లో బంట్వారం మూడు సంవత్సరాలు పనిచేసే బదిలీపై తాండూర్ లో నాలుగు సంవత్సరాలు పని చేసి బషీరాబాద్ లో 16 సంవత్సరాలు పనిచేసే స్తూ ప్రమోషన్ పదోన్నతుని పొంది ఆరు సంవత్సరాలుగా బషీరాబాద్ విధులు నిర్వహిస్తూ పదవి విరమణకు తోటి సిబ్బంది పలికినందుకు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమనికి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకి,పిఎసిఎస్ చైర్మన్ కరుణ అజయ్ ప్రసాద్, సీసీలు జగదీష్,సేవ్య నాయక్,ఐకెపి సిబ్బంది, డ్రక్రా మహిళా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.