schedule Monday, November 02, 2026

ఉడిపి రుచులతో తాండూరులో నూతన టిఫిన్స్ సెంటర్ ప్రారంభం

calendar_today November 1, 2026
person Prajagalam News
ఉడిపి రుచులతో తాండూరులో నూతన టిఫిన్స్ సెంటర్ ప్రారంభం
ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన RBOL CEO, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR)   తాండూర్ టౌన్:   తాండూరు పట్టణ ప్రజలకు మరో నూతన ఆహార కేంద్రం అందుబాటులోకి వచ్చింది. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఉడిపి కృష్ణ టిఫిన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి RBOL CEO, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) ముఖ్య అతిథిగా హాజరై టిఫిన్స్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉడిపి సంప్రదాయ రుచులతో, నాణ్యమైన ఆహార పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలకు అందిస్తూ వినియోగదారుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. వ్యాపారంలో మంచి గుర్తింపు సాధిస్తూ మరింత అభివృద్ధి చెందాలని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు.