schedule Thursday, September 03, 2026

పరిగిలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు 

calendar_today April 11, 2026
person Prajagalam News
పరిగిలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు 
(పరిగి)
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని కొడంగల్ చౌరస్తాలో మహాత్మ జ్యోతిరావు ఫూలే  జయంతి ని పురస్కరించుకొని  శనివారం వారి విగ్రహానికి పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ జ్యోతిరావు పూలే  సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలు అపారమని  సమానత్వం, విద్య కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.