schedule Thursday, September 03, 2026

కుల్కచర్ల ఆసుపత్రిలో సిబ్బందిపై దాడి అంబులెన్స్ ధ్వంసం – టెక్నీషియన్‌కు గాయాలు

calendar_today April 11, 2026
person Prajagalam News
కుల్కచర్ల ఆసుపత్రిలో సిబ్బందిపై దాడి  అంబులెన్స్ ధ్వంసం – టెక్నీషియన్‌కు గాయాలు
(కుల్కచర్ల) కుల్కచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం సాయంత్రం గాయాలతో వచ్చిన ఇద్దరు యువకులు విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఆసుపత్రి సిబ్బంది, సుజాత తెలిపిన వివరాల ప్రకారం... గాయాలైన ఆదిత్యను కేశవులు ఆసుపత్రికి తీసుకువచ్చడు. ఆస్పత్రి సిబ్బంది వారికి ప్రాథమిక చికిత్స అందించి 108 అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సమయంలో రిఫరల్ చిట్టి గురించి అడిగిన అంబులెన్స్ టెక్నీషియన్ అశోక్‌పై యువకులు దాడి చేసి తలకు గాయపరిచారు. అంబులెన్స్ అద్దాన్ని పగలగొట్టి, ఆసుపత్రిలో కుర్చీలు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ఆస్పత్రి సిబ్బంది సుజాత పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.