schedule Thursday, May 21, 2026

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడు

calendar_today April 14, 2026
person Prajagalam News
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడు
  గొట్టిముక్కల సర్పంచ్ సుద్దగళ్ల సంగీతా లింగమయ్య
  • వికారాబాద్ -: మహా జ్ఞాని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొందరి వాడు కాదని,ఆయన అందరి వాడు అని గొట్టిముక్కల గ్రామ సర్పంచ్ సుద్దగళ్ల సంగీతాలింగమయ్య అన్నారు.మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంలో బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు గ్రామ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.అంబేద్కర్ విగ్రహానికి గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సంగీతాలింగమయ్య మాట్లాడుతూ...బి.ఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల వారి కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు.దేశ విదేశాలు తిరిగి ప్రపంచంలోనే భారత దేశానికే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన ఘనత ఆయనకు దక్కిందన్నారు.నేడు బడుగుబాలహీన వర్గాల ప్రజలు పదవులు,ఉద్యోగాలు పొందుతున్నారంటే కేవలం అంబేద్కర్ పుణ్యమే అని కొనియాడారు.సమాజంలో అంటరాని తనాన్ని రూపు మాపలనే లక్ష్యం పెట్టుకొని ఆయన పోరాటం సాగించారని అన్నారు.నాటి కాలంలో మహిళలకు విద్య ఎందుకు అనే భావన ఉండేదని,కానీ మహిళలు విద్యను అభ్యసిస్తేనే కుటుంబాలు బాగు పడుతాయని ఆనాడే అంబేద్కర్ తెలియజేశారన్నారు.గ్రామంలోని ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మైస గోపాల్,వార్డు మెంబర్స్ దశరత్,మల్లేష్,బోవయ్య,పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్,పంచాయతీ కార్యదర్శి మధుకర్ రెడ్డి, అంబెడ్కర్ యువజన సంఘం నాయకులు ఆర్.అనంతయ్య,కుమార్,ఆర్. వెంకటేష్,సురేష్,నర్సింహాలు,యాదగిరి,మాజీ ఉప సర్పంచ్ మల్లేష్, గ్రామ రైతు బంధు అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,గ్రామ యువత,గ్రామస్తులు పాల్గొన్నారు.