schedule Thursday, September 03, 2026

అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి

calendar_today April 14, 2026
person Prajagalam News
అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
(పరిగి) :-వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహిచారు . ఈ కార్యక్రమంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం మహేష్ రెడ్డి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు అపారమని. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.