schedule Wednesday, September 02, 2026

దాస్యానాయక్ తండాలో జల మహోత్సవం

calendar_today April 23, 2026
person Prajagalam News
దాస్యానాయక్ తండాలో జల మహోత్సవం
వికారాబాద్ జిల్లా(కుల్కచర్ల):-  కుల్కచర్ల మండలంలోని దాస్య నాయక్ తండా గ్రామపంచాయతీలో గురువారం జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో జల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. హర్ ఘర్ జల్ కార్యక్రమంలో మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న తాగునీటిని ప్రజలు వినియోగించుకోవాలని దాస్యనాయక్ తండా సర్పంచ్ నేనావత్ కవిత రాజు నాయక్ సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిషన్ భగీరథ డీఈ సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ ఎఈ ఎం అభిలాష్, గ్రీడ్ ఏఈ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భగీరథ నీరు సురక్షితమైనదని, ప్రతి ఒక్కరూ తాగునీటిని ఉపయోగించుకోవాలని తెలిపారు.సర్పంచ్ నేనావత్ కవి రాజు నాయక్ మాట్లాడుతూ గ్రామంలో మిషన్ భగీరథ నీరు సకాలంలో అందుతున్నదని, ప్రజలు నీటిని జాగ్రత్తగా వినియోగిస్తున్నారని తెలిపారు. నీటి వనరులను సంరక్షణ కోసం గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నూరి తుక్య నాయక్, పంచాయతీ కార్యదర్శి అనిత, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.