నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
April 26, 2026
Prajagalam News
(తాండూరు )
పట్టణంలోని జి పి ఆర్ గార్డెన్స్ లో మిత్రు నాయక్ కోడలి వివాహ వేడుక, వినాయక కన్వెన్షన్ లో బషీరాబాద్ మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి కూతురు వివాహ వేడుక, భవాని ఫంక్షన్ హాల్ లో రాంపూర్ సర్పంచ్ కుమారుని వివాహ వేడుక, ఆర్యవైశ్యలో మారేపల్లి వాస్తవ్యులు రవీందర్ రెడ్డి కూతురు వివాహ వేడుక, రాయల్ ఫంక్షన్ హాల్ లో చెంగోల్ వాస్తవ్యులు గోపాల్ రెడ్డి కుమారుని వివాహ వేడుక, తులసి గార్డెన్స్ లో జరిగిన పలు వివాహ వేడుకలలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం సల్లా గార్డెన్స్ లో యువ నాయకులు అశోక్ వివాహ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని ఆశీర్వదించారు.