schedule Wednesday, September 02, 2026

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తాం..

calendar_today May 2, 2026
person Prajagalam News
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తాం..
  (కుల్కచర్ల)   అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తామని డిసిసి ఉపాధ్యక్షుడు బోలుసాని భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్ ఆంజనేయులు ముదిరాజ్, కాంగ్రెస్ బ్లాక్ టు అధ్యక్షుడు కర్రె భరత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జోగు అనూష, శాంత కుమార్ నిర్మించిన నూతన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు... కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి పేదోడికి న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు వెంకటయ్య గౌడ్, మండల నాయకులు మోత్కూర్ వెంకటేష్, నర్సింలు, భాను, మురళి, శ్రీనివాస్ రెడ్డి, రాజు గౌడ్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.