schedule Wednesday, September 02, 2026

గిరిజన ఆడబిడ్డల పెళ్ళిళ్లకు అండగా ఉంటా  పటేల్ చెరువు తండా సర్పంచ్ శాంతి తుల్సిరాం నాయక్

calendar_today May 2, 2026
person Prajagalam News
గిరిజన ఆడబిడ్డల పెళ్ళిళ్లకు అండగా ఉంటా    పటేల్ చెరువు తండా సర్పంచ్ శాంతి తుల్సిరాం నాయక్
(కుల్కచర్ల)
ఆడబిడ్డల పెళ్ళిళ్ళకు అండగా ఉంటానని పటేల్ చెరువు తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ శాంతి తుల్సిరాం నాయక్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా
కుల్కచర్ల మండల పరిధిలోని
పటేల్ చెరువు తండా గ్రామపంచాయతీ పరిధిలోని పొట్టిగడ్డ తండాలో విస్లావత్ గంగా భాయ్ గోపాల్ దంపతుల కుమార్తె అనూష వివాహనికి గ్రామ సర్పంచ్ గారు అందిస్తున్న శాంతి కానుక కార్యక్రమంలో భాగంగా ఒక క్వింటాల్ సోనా బియ్యం,15 కేజీల మంచి నూనె,20 ఫిల్టర్ వాటర్ కూలింగ్ డబ్బాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు తులసీరాం నాయక్,ఉప సర్పంచ్ గోపాల్,వార్డు సభ్యురాలు,గంగాబాయి గోపాల్,మాజీ వార్డు సభ్యురాలు లక్ష్మీ రాము,తండా పెద్దలు శ్రీను నాయక్,కొండా నాయక్,హరిచంద్,రాజు చందర్,సురేష్, తాండ యువకులు మహిళలు పాల్గొన్నారు.