schedule Wednesday, September 02, 2026

తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన వ్యక్తి జయశంకర్ సార్

calendar_today August 6, 2026
person Prajagalam News
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన వ్యక్తి జయశంకర్ సార్
గొట్టిముక్కల సర్పంచ్ సుద్దగళ్ల సంగీతాలింగమయ్య
  • వికారాబాద్-:ప్రొఫెసర్ జయశంకర్ సర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారని గొట్టిముక్కల సర్పంచ్ సుద్దగళ్ల సంగీతాలింగమయ్య అన్నారు.గురువారం వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సుద్దగళ్ల సంగీతాలింగమయ్య ఆధ్వర్యంలో ఫ్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ సుద్దగళ్ల సంగీతాలింగమయ్య మాట్లాడుతూ...తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సేవలు మరవలేనివని కొనియాడారు.1969 తెలంగాణ ఉద్యమంలోనూ,అంతకు ముందు ఉన్న ముల్కీ,సాంబార్ ఇడ్లి గో బ్యాక్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని అన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రాశారని గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్లారా చూడాలని తరచుగా చెప్పే జయశంకర్ సార్ 2011 లోనే మరణించారని తెలిపారు.నేటి యువత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అడుగుజాడల్లో నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మైసా గోపాల్ ,మాజీ ఎంపీటీసీ చాకలి గోపాల్,గ్రామస్తులు శ్రీనివాస్,నర్సింహులు, శివ,మైసా నరేష్,రాములు తదితరులు పాల్గొన్నారు.