అనంతగిరి పల్లి లో ఘనంగా బోనాల పండుగ
August 9, 2026
Prajagalam News
⇒భక్తి శ్రద్ధలతో గ్రామ దేవతలకు పూజలు
⇒పాల్గొన్న కౌన్సిలర్ అర్ధ సుధాకర్ రెడ్డి
వికారాబాద్-:వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరి పల్లిలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. అనంతగిరిపల్లిలో పోచమ్మ, మైసమ్మలకు భక్తులు ఘనంగా బోనాలు తీశారు.వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ & పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో, అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిల్ రెడ్డి నాయక్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు నాయక్,శేఖర్, నాగరాజు,బాగయ్య, బాలరాజు ,వెంకట్ ,నందు ,శేఖర్ , మాణిక్యం, మల్లేశం, నరసింహులు,సుధాకర్, సాయి, నారాయణ,లక్ష్మణ్, సాయి, గిరి,మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు.