schedule Tuesday, November 03, 2026

ఆనాటి ఉద్యమకారుడు నేటి మార్కెట్ కమిటీ డైరెక్టర్‌ కు ఉద్యమకారుల హర్షం

calendar_today September 30, 2026
person Prajagalam News
ఆనాటి ఉద్యమకారుడు నేటి మార్కెట్ కమిటీ డైరెక్టర్‌ కు ఉద్యమకారుల హర్షం
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో తెలంగాణ ఉద్యమకారుడు మధుదాదా బషీరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా నియమితులైన సందర్భంగా ఆయనను తోటి ఉద్యమకారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యమ నాయకులు నూరోద్దీన్,శివరాం నాయక్,ఖాసిం పాషా,భీమణ్ణ తదితరులు మధు దాదా నివాసానికి వెళ్లి,ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మధుదాదాకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి దక్కడం సముచిత గౌరవమని,ఆయన నియామకం పట్ల స్థానిక ఉద్యమకారులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.