schedule Tuesday, November 03, 2026

మండల స్థాయి సమీక్ష సమావేశం, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరు

calendar_today October 1, 2026
person Prajagalam News
మండల స్థాయి సమీక్ష సమావేశం, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరు
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని స్థానిక రైతు వేదికలో ఎంపీడీవో సంపత్ అధ్యక్షతనలో మండల స్థాయి సమీక్ష సమావేశం వాడీవేడిగా జరిగింది.ఈ కార్యక్రమానికి తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో అన్ని శాఖల అధికారులు తమ శాఖల నివేదికలను సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. 70 కోట్లతో రోడ్ల నిర్మాణం,రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అధికారులు అందుబాటులో ఉండాలి. ప్రజా సమస్యల త్వరిత పరిష్కారానికి అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నీటి బట్టు వరుసగా పట్టేలా ఆర్ డబ్లూ ఎస్ పంచాయతీరాజ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు: అర్హులైన పేదలను గుర్తించి పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కరుణ అజయ్ ప్రసాద్,ఏఎంసి వైస్ శంకరప్ప,మండల సర్పంచ్ ల సంగం అధ్యక్షులు వెంకటేష్ మహారాజ్,వివిధ గ్రామాల సర్పంచులు,వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.