schedule Tuesday, November 03, 2026

ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అసంతృప్తి,మాజీ ఎమ్మెల్యే నారాయణరావు నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భేటీ

calendar_today October 23, 2026
person Prajagalam News
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అసంతృప్తి,మాజీ ఎమ్మెల్యే నారాయణరావు నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భేటీ
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భేటీ అయ్యారు.ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఒకరిద్దరికి ప్రాధాన్తిస్తూ,మిగతా నాయకులను మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఒంటెద్దు పోకటపోవడం సరికాదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు కల్పించుకొని మీ అందరికీ అండగా ఉంటానని,జరిగిన విషయాలపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.అధిష్టానం స్పందిస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.ఈ కార్యక్రమంలో బషీరాబాద్ గ్రామ సర్పంచ్ వెంకటేష్ మహారాజ్,మాజీ జెడ్పిటిసి రాకేష్ మహారాజ్,పిఎసిఎస్ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ జి.మాధవరెడ్డి,రాము నాయక్,అబ్దుల్ ఖలీల్, మాణిక్ రెడ్డి,రోహిత్ మహారాజ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు ఉన్నారు.