హిందూ ఉత్సవ కమిటీ నూతన కార్యవర్గానికి బీఎస్ఆర్ అభినందనలు
calendar_today
September 5, 2026
person
Prajagalam News
• హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి.
• బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
( తాండూర్ )
తాండూర్ పట్టణంలోని హిందూ ఉత్సవ కమిటీ నూతన కార్యవర్గ సభ్యులను సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాసరెడ్డి (బీఎస్ఆర్) అభినందించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్‌లో మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. హిందూ ధర్మం, సంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేలా ఉత్సవ కమిటీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. యువతను సన్మార్గంలో నడిపించేందుకు, మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని వారికి తెలియజేసేందుకు కమిటీ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. తాండూర్ పట్టణంలో రానున్న గణేష్ ఉత్సవాలను ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించడంలో హిందూ ఉత్సవ కమిటీ కృషి చేయాలని అన్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం, వివిధ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.ప్రజలందరినీ కలుపుకొని పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం ద్వారా తాండూర్ పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో కూడా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ధార్మిక, సామాజిక కార్యక్రమాలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ నూతన కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.