ఉపాధ్యాయ దినోత్సవం రోజున విద్యార్థులతో రాజకీయ ర్యాలీలు సిగ్గుచేటు
calendar_today
September 5, 2026
person
Prajagalam News
• నియోజకవర్గ ఎన్ఎస్యుఐ అధ్యక్షులు ప్రేమ్ కుమార్
( తాండూర్)
ఉపాధ్యాయ దినోత్సవం రోజున విద్యార్థులను రాజకీయ ర్యాలీలకు వినియోగించడం సిగ్గుచేటని తాండూర్ నియోజకవర్గ NSUI అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ విమర్శించారు. ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ప్రజల మద్దతు లేకపోవడంతోనే విద్యార్థులను ర్యాలీలకు తీసుకువచ్చి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 5న విద్యార్థులు, ఉపాధ్యాయులు వేడుకలు జరుపుకోవాల్సిన సమయంలో వారిని రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, యువత సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఉద్యోగాల భర్తీ, హాస్టల్ మెస్, కాస్మెటిక్ చార్జీల పెంపు, బ్రేక్‌ఫాస్ట్, యూనిఫాంలు, షూల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.తాండూర్‌లో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఐటిఐ సమస్యను పరిష్కరించి ఏటిసిగా తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉంచి, వారి విద్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ నాయకులకు ప్రేమ్ కుమార్ సూచించారు.