schedule Saturday, September 05, 2026

ఈ నెల 10న చలో హైదరాబాద్ ను విజయవంతం చేయండి

calendar_today September 5, 2026
person Prajagalam News
ఈ నెల 10న చలో హైదరాబాద్ ను విజయవంతం చేయండి
 

⇒టిజిఈ జెఏసి చైర్మన్ అజ్మత్ పాషా

  • Vikarabad:- సెప్టెంబర్ 10న నిర్వహించ తలపెట్టిన ఛలో హైద్రాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికారాబాద్ జిల్లా టిజిఈ జెఏసీ జిల్లా చైర్మన్ అజ్మత్ పాషా పిలుపునిచ్చారు.శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పెండింగ్ లో ఉన్న 6 డి.ఏ లను వెంటనే విడుదల చేయాలని అన్నారు. 2వ పి. ఆర్. సి .ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.ఉద్యోగుల, పెన్షనర్ల పెండింగ్ బిల్లులను కనీసం నెలకు రూ. 2000 కోట్లచొప్పున చెల్లించాలని తెలిపారు.ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని పూర్తి స్థాయిలో సమర్ధవంతంగా అమలు చేయాలని,ప్రభుత్వం హామీ ఇచ్చి ఇంకా అమలుకాని అన్ని డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా టిజిఈ జెఏసి సెక్రటరీ జనరల్ సత్తార్, అడిషనల్ సెక్రటరీ నర్సిములు ,కో- చైర్మన్ వెంకటరత్నం, రాఘవేందర్, కుమార్,కార్యదర్శి సుదర్శన్, పెన్షనర్ల సంఘం అధ్యక్షులు మణిక్ ప్రభు, పాల్గొన్నారు.