schedule Saturday, September 05, 2026

విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

calendar_today September 5, 2026
person Prajagalam News
విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

• మాజీ ఎమ్మెల్యే పైలెట్  రోహిత్ రెడ్డి

• వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్‌వీ సమరభేరి.

(తాండూర్) కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను ప్రశ్నిస్తూ బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు యువత భారీగా తరలిరావడంతో ఇందిరా చౌక్ జనసంద్రంగా మారింది. ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలు, యువత సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ నాయకులు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాటం ఆగదని, గత ఎన్నికలలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని,యువతను అణచివేయాలని చూస్తే ఉద్యమం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ పీఠాన్ని కదిలించడం పెద్ద లెక్క కాదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఆందోళన కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం, పైలట్ రోహిత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేయడం, అభిమాన నాయకునితో సెల్ఫీలకు పోటీ పడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.