schedule Saturday, September 05, 2026

రేపు జరిగే మహా ధర్నాను విజయవంతం చేద్దాం!

calendar_today September 5, 2026
person Prajagalam News
రేపు జరిగే మహా ధర్నాను విజయవంతం చేద్దాం!

⇒రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

  • Vikarabad-:కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో వెయ్యి రోజుల ప్రగతిని వివరిస్తూ,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రేపు హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందని,దీనికి పెద్ద ఎత్తున్న కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.మంత్రి పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వికారాబాద్ డీసీసీ అధ్యక్షులు జాదవ్ ధారసింగ్ నాయక్ పాల్గొన్నారు. ప్రజా పాలనలో వెయ్యి రోజుల ప్రగతిని వివరిస్తూ.. మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ సెప్టెంబర్ 06న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.మంత్రి పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు మధుయాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జిలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులతో కలిసి వికారాబాద్ డీసీసీ అధ్యక్షులు జాదవ్ ధారసింగ్ నాయక్ పాల్గొన్నారు.