• కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
• శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలకు రూ.5 లక్షల భారీ విరాళం
(తాండూర్)
విద్యార్థులే రేపటి భవిష్యత్ భారత నిర్మాతలని, వారికి నాణ్యమైన విద్యతో పాటు సంస్కారం, దేశభక్తి, సామాజిక స్పృహను అందించడం సమాజం బాధ్యత అని ఆర్బిఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలకు రూ.5 లక్షల విరాళాన్ని ఆయన చెక్కు రూపంలో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సరస్వతీ విద్యాపీఠం, శిశు మందిర్ విద్యాలయాలు విద్యార్థులకు విద్యతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను అందిస్తున్నాయని తెలిపారు. విద్యార్థులను దేశభక్తి, సామాజిక బాధ్యత కలిగిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ విరాళం ఇచ్చినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ పాఠశాలకు సహకరిస్తానని తెలిపారు.విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. పాఠశాలకు రూ.5 లక్షల విరాళం అందించిన శ్రీనివాస్ రెడ్డికి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సరస్వతీ విద్యాపీఠం జిల్లా అధ్యక్షులు డా. మల్లేశం, పాఠశాల అధ్యక్షులు కటకం వీరేందర్, యాజమాన్య కమిటీ సభ్యులు పెరుమాళ్ల రాం రెడ్డి, అనంత రెడ్డి, జి. నరేందర్, కౌన్సిలర్లు జుంటుపల్లి వెంకట్, ఎం. రామకృష్ణ, ఎన్. రాజు గౌడ్, విద్యావేత్త పర్యాద రామకృష్ణ, భీం శెట్టి మధుసూదన్, సుబ్బారావు, ప్రభుశంకర్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల్, జోషి వికాస్, ప్రహ్లాద్, సమద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.