schedule Saturday, September 05, 2026

రోహిత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు.

calendar_today September 5, 2026
person Prajagalam News
రోహిత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు.
 

• వ్యక్తిగత విమర్శలను పక్కనపెట్టి  అభివృద్ధిపై దృష్టి పెట్టాలి.

• తాండూరు బీఆర్ఎస్ నాయకులు

(తాండూరు ) మాజీ రోహిత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని తాండూరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇర్షాద్, సురేష్ నాయకులు ఆసిఫ్, సంతోష్ గౌడ్ లు అన్నారు. శనివారం  రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఓటుకు నోటు అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చిన విషయం కాంగ్రెస్ నేతలు మరిచినట్లున్నారన్నారు. పైలెట్ రోహిత్ రెడ్డి పై డ్రగ్స్ కేసు,డ్రగ్స్ కేసు అంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను మానుకోవాలన్నారు. డ్రగ్స్ కేసు విచారణకు రాకముందే దానిపై తీర్పు వెలుపడక ముందే ఈ విధంగా ఒక వ్యక్తి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరికాదన్నారు.తాండూరు నీళ్లు నిధులను కొడంగల్ కు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ధారాధత్వం చేస్తున్నారన్నారు. తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని కొడంగల్ కు మార్చేస్తున్నారన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తాండూర్ కు వస్తే దానిని కొడంగల్లోని లగ్గచర్ల ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు. కాగ్నా నీళ్లను తాండూరు వాసులకే సరిపోవు లేవని అదనంగా కొడంగల్ యాలాల్ మండలాలకు సరఫరా చేస్తామనడం హాస్యాస్పదమని అన్నారు. కొడంగల్ కు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. నర్సింగ్ కాలేజీ కోసం రోహిత్ రెడ్డి అహర్నిశలు కష్టపడి తాండూరు కు తీసుకొని వస్తే దాంట్లో కొడంగల్ మెడికల్ కాలేజీ నిర్వహిస్తూ నర్సింగ్ కాలేజీ విద్యార్థులకు పాత భావనాన్ని ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూట్ కేసులను ఢిల్లీకి మోసుకెళ్తూ ఉంటే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు ప్రజల పథకాలను  కొడంగల్ కు మోసుకెళ్తున్నారన్నారు. రోహిత్ రెడ్డి పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ గాజులు ఎవరూ వేసుకుని కూర్చోలేదని వ్యక్తిగత విమర్శలు మానుకోని తాండూర్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. చర్చకు తాము ఎప్పుడైనా సిద్ధమని గణేష్ నిమజ్జనం తర్వాత పెట్టాలని కోరారు.ఈ సమావేశంలో కౌన్సిలర్ అనిల్ కుమార్,నాయకులు రుద్రపటేల్, సంజీవ్, కరుణాకర్, అనంతరెడ్డి, ఇజాజ్, తదితరులు ఉన్నారు.