తాండూర్ లో డాక్టర్ నిఖిల్ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభం
calendar_today
September 5, 2026
person
Prajagalam News
• ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
(తాండూరు)
తాండూరు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ నిఖిల్ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ను శనివారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సెంటర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసి, తాండూరు పట్టణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు.అనంతరం సెంటర్‌లో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందించే ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ సేవలు, చికిత్సకు ఉపయోగించే పరికరాలు, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వాహకులు డాక్టర్ నిఖిల్ మాట్లాడుతూ శారీరక ఇబ్బందులు, కీళ్ల నొప్పులు, కండరాల సమస్యలు, ప్రమాదాలు లేదా ఇతర కారణాలతో పునరావాస చికిత్స అవసరమయ్యే వారికి ప్రత్యేక సేవలు అందించేందుకు సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సెంటర్ నిర్వాహకులు డాక్టర్ ఐశ్వర్య రెడ్డి, సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.