schedule Saturday, September 05, 2026

బీజేపీ కౌన్సిలర్లను సన్మానించిన వడ్ల నందు

calendar_today April 6, 2026
person Prajagalam News
బీజేపీ కౌన్సిలర్లను సన్మానించిన వడ్ల నందు
  వికారాబాద్ -: వికారాబాద్ మున్సిపల్ లో బీజేపీ నుంచి గెలుపొంది,ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లను బీజేపీ వికారాబాద్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ,దిశ కమిటీ మెంబర్ వడ్ల నందు సన్మానించారు. వికారాబాద్ మున్సిపల్ కౌన్సిల్ లో ప్రమాణ స్వీకారం చేసిన 4గురు వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు  33 వ వార్డు కౌన్సిలర్,బిజెపి కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ అనిల్ యాదవ్,5 వ వార్డ్ కౌన్సిలర్ స్రవంతి శ్యామ్ రెడ్డి,24 వ వార్డ్ కౌన్సిలర్ రుచిత సాయి చరణ్ రెడ్డి,28 వ వార్డు కౌన్సిలర్ లావణ్య సురేందర్ ను వికారాబాద్ బిజెపి అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు  సన్మానించారు. ఈ సందర్భంగా వడ్ల నందు మాట్లాడుతూ....వికారాబాద్ లో బీజేపీ బలోపేతం అవుతుందని అన్నారు.వికారాబాద్ పట్టణ ప్రజల సమస్యలను,వాటి పరిష్కారానికి బీజేపీ కౌన్సిలర్లు కృషిచేయాలని సూచించారు.అదేవిధంగా మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే స్పందించి కౌన్సిల్ లో మాట్లాడి ప్రజల తరపున పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి,మల్లా రెడ్డి,నర్సిములు,రాంచందర్,బీజేపీ నాయకులు పాల్గొన్నారు.