schedule Saturday, September 05, 2026

స్వప్న పరిమళ్ కుటుంబాన్ని పరామర్శించిన చీఫ్ విప్ మహేందర్ రెడ్డి

calendar_today April 12, 2026
person Prajagalam News
స్వప్న పరిమళ్ కుటుంబాన్ని పరామర్శించిన చీఫ్ విప్ మహేందర్ రెడ్డి
    (తాండూర్) మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ ను శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.తాండూర్ లో పలు కార్యక్రమాలలో పాల్గొంటూ అటుగా వెళ్లిన మహేందర్ రెడ్డి చైర్ పర్సన్ ఇంటివద్ద కాసేపు కూర్చున్నారు. కుశల ప్రశ్నలు వేశారు. ఇటీవల ప్రోటోకాల్ సంబంధిత అంశాలలో తనకు కొందరు నాయకులు పట్టించుకోవడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో తాను ఉన్నానంటూ మహేందర్ రెడ్డి స్వప్నకు భరోసా ఇచ్చారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలంటే స్వప్నలాంటి నాయకులు చురుకుగా ఉండాలని ఆయన సూచించారు. ఆయన వెంట టిపిసిసి సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు, తంబాకు చంద్రశేఖర్, బిర్కిట్ రఘు, అరవింద్ రెడ్డి తదితరులు ఉన్నారు.