schedule Sunday, September 06, 2026

కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే..!

calendar_today September 6, 2026
person Prajagalam News
కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే..!

- మహాధర్నాలో డీసీసీ అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్

  • Vikarabad-: ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ మహాధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్ మాట్లాడుతూ. .వెయ్యి రోజులుగా ఎమ్మెల్యేగా జీతభత్యాలు పొందుతూ ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతలను నిర్వర్తించకుండా, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ఉన్న కేసీఆర్ వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్, హరీశ్ రావు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మబోరని అన్నారు. ఈ మహాధర్నాలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు హనుమంతు రావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్తో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మహాధర్నాలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.