schedule Sunday, September 06, 2026

కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి

calendar_today September 6, 2026
person Prajagalam News
కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి
 

- నేడు పల్లెలో అభివృద్ధి శూన్యం - - కేసీఆర్ ఆనవాళ్లను ఎవరు చేరపలేరు

- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

  • Vikarabad-: “కేసీఆర్ హయాంలో అభివృద్ధిని చూశాం… కాంగ్రెస్ పాలనలో పల్లెల విధ్వంసాన్ని చూస్తున్నామని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్న నేపథ్యంలో, పల్లెల విధ్వంసం కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండలంలోని గట్టేపల్లి గ్రామంలో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పర్యటించారు.ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, వైకుంఠధామాన్ని సందర్శించారు.అనంతరం బంట్వారం మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం… ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు.కేసీఆర్ హయాంలో గ్రామాలకు వచ్చిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోలేదు… కాంగ్రెస్ చేసిన మోసాన్ని కూడా ప్రజలు మర్చిపోరన్నారు.వైకుంఠధామం నుంచి క్రీడా ప్రాంగణం వరకు… పార్కుల నుంచి గ్రామాభివృద్ధి వరకు—కేసీఆర్ మార్క్ అభివృద్ధి ప్రతి గ్రామంలో కనిపిస్తుందని చెప్పారు.అభివృద్ధి చేసి చూపించిన కేసీఆర్‌ను ప్రజలు చూశారు… హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌ను కూడా ప్రజలు చూస్తున్నారని ఆయన అన్నారు.మాటలు చెప్పడం కాదు… చేసి చూపించడం కేసీఆర్ నైజం! హామీలు ఇవ్వడం, మర్చిపోవడం కాంగ్రెస్ నైజమని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు.ప్రజల హక్కుల కోసం బీఆర్ఎస్ కార్యకర్త గళమెత్తుతాడు… అవసరమైతే రోడ్డుపైకి వచ్చి పోరాడుతాడని బీఆర్ఎస్ కార్యకర్తలను ఉదేశించి అన్నారు.గ్రామాల అభివృద్ధిని ఆపితే ఊరుకోం… ప్రజల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రశ్నించకుండా ఉండమని తెలిపారు.అధికారం శాశ్వతం కాదు… ప్రజల తీర్పే అంతిమం! బంట్వారం గట్టేపల్లి గ్రామాల ప్రజల గొంతు రేపటి రాజకీయ మార్పుకు నాంది అని అన్నారు.